బార్సిలోనా: ఈ వారమంతా బార్సిలోనాలోని సాహసవంతులైన ప్రయాణికులు డ్రైవర్ రహిత బస్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు! రెనాల్ట్ కంపెనీ తన స్వయం చాలిత బస్కు ట్రయల్ రన్ నిర్వహిస్తుండటంతో వారికి ఈ అవకాశం లభించింది. నగరంలోని రద్దీ ప్రాంతంలో ఈ బస్ లేన్ మారే ముందు పద్ధతిగా బ్రేక్ వేస్తూ ప్రమాదాల బారిన పడకుండా ముందుకు సాగుతున్నది.
విరైడ్ కంపెనీతో కలిసి ఈ ప్రొటోటైప్ బస్ను రెనాల్ట్ అభివృద్ధి చేసింది. ఈ బస్ను భవిష్యత్తు బస్గా అందులో ప్రయాణించిన ఓ విద్యార్థిని(18) అభివర్ణించింది. ఈ విద్యుత్తు బస్ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో 120 కిలోమీటర్ల వరకు రీచార్జ్ అవసరం లేకుండా ప్రయాణిస్తుంది. 10 కెమెరాలు, 8 సెన్సార్ల సాయంతో తన మార్గాన్ని గమనిస్తూ ఈ బస్ ముందుకు సాగుతుంది.