అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌తో దర్శకుడు ప్రశాంత్‌నీల్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పానిండియా చిత్రం ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్)పై ఆడియన్స్‌లో అంచనాలు మామూలుగా లేవు. ఆలస్యం అవుతున్నకొద్దీ అవి అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇందులో విలన్ పాత్ర చాలా కీలకం. దీనికోసం ముందు మలయాళ స్టార్ హీరో టోవినో థామస్‌ని అడిగారు. కానీ టోవినో ఖాతాలో పూర్తి చేయాల్సిన సినిమాలు చాలానే ఉండటంతో ‘డ్రాగన్’కు ఆయన ఓకే చెప్పలేకపోయారు.
అయితే.. ఇప్పుడు ఈ ప్లేస్‌లోకి బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ వచ్చి చేరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో విలన్‌గా షాహిద్ దాదాపుగా ఖరారైనట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే బాలీవుడ్ మార్కెట్లో కూడా ఈ సినిమాకు మంచి బూస్టప్ రావడం ఖాయం. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రుక్మిణీవసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.