అగ్ర కథానాయకుడు నాని నటిస్తున్న పానిండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ప్రముఖనటుడు మోహన్‌బాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కయాదు లోహర్ కథానాయిక. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో సినిమా విడుదల కానున్నది. శనివారం చిత్ర కథానాయిక కయాదు లోహర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘ది ప్యారడైజ్’ ప్రపంచంలో సుబ్బలక్ష్మి అలియాస్ సుబ్బుగా సైకిల్‌పై వస్తూవున్న కయాదు లోహర్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. ఈ సినిమా మొత్తం రగ్డ్, ఇంటెన్స్ ప్రపంచంలో కనిపిస్తున్నప్పటికీ, కయాదు పాత్ర మాత్రం అందుకు పూర్తి భిన్నంగా అద్భుతమైన సౌందర్యంతో సాక్షాత్కరించింది. ఇప్పటికే భారీ విజువల్స్, గ్రాండ్ సెట్టింగ్స్తోపాటు బలమైన పాత్రలతో అంచనాలను పెంచుతున్న ఈ చిత్రంలో రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు ముఖ్య పాత్రల్లో కనిపంచనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సీహెచ్ సాయి, సంగీతం: అనిరుథ్ రవిచందర్, నిర్మాణం: ఎస్ఎల్వీ సినిమాస్.