హిమాయత్‌నగర్,డిసెంబర్12: ప్రపంచ బ్యాంకు ర్యాంప్ ప్రోగ్రాం లీగల్ కన్సల్టెంట్‌గా తెలంగాణకు చెందిన ఇంటర్నేషనల్ లాయర్ డాక్టర్ కరణం రాజేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన 18 నెలల పాటు సేవలు అందిచనున్నారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న యువ న్యాయవాదులు అంతర్జాతీయంగా సేవలు అందించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.