హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని రక్షణ లోహ పరిశోధనా ప్రయోగశాల (డీఎంఆర్ఎల్) డైరెక్టర్గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ గోపీనాథ్ కకోప్రత్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈయన ఏరోనాటికల్ ప్రాజెక్టులు, కోర్ రీసెర్చ్ కార్యకలాపాలకు నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ సాయుధ దళాలకు అత్యాధునిక, పూర్తి స్వదేశీ సాంకేతికతలతో కూడిన పరికరాలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.