వినాయక నగర్ : నిజామాబాద్, ముద్కేడ్ రైల్వే స్టేషన్లతో పాటు పలు అభివృద్ధి పనులను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ (SCR GM Arun Kumar Jain) బుధవారం పరిశీలించారు. నిజామాబాద్ ( Nizamabad) రైల్వే స్టేషన్ లతోపాటు ప్రయాణికుల విశ్రాంతి గదులు, రైల్వే సిగ్నల్ కంట్రోల్ రూమ్ ను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా రైల్వే సిబ్బంది వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్లింగ్ (Doubling) పనులు కొనసాగుతున్నాయని, మరో మూడేండ్లలో పనులు పూర్తి అవుతాయని వెల్లడించారు. రైలు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను , సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించేందుకు రైల్వే శాఖ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆయనతో పాటు డీఆర్ఎం లోకేష్ వైష్ణోయిని , నిజామాబాద్ స్టేషన్ మేనేజర్, ఆర్పీఎఫ్ సిబ్బంది, జీఆర్పీ సిబ్బంది ఉన్నారు.