హైదరాబాద్: ఇంజినీరింగ్లో సీట్లు పొందలేని వారి కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) స్పెషల్ డ్రైవ్ ఫేజ్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి (TSCHE) విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో మొత్తం 4 లక్షలకు పైగా సీట్లుండగా.. ఇప్పటి వరకు 1.5 లక్షల సీట్లు మాత్రమే నిండాయి. మిగిలిన సీట్లను ఈ విడతలో భర్తీచేస్తామన్నారు. ఇప్పటివరకు దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యా ర్థులు.. రూ.400 చెల్లించి తమ పేరు నమోదుచేసుకోవాలని సూచించారు.