DOST | హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాలకు నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్ శుక్రవారం విడుదలకానుంది. బుధవారం దోస్త్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి షెడ్యూల్ ఖరారు చేస్తారు. ఈ సారి మూడు విడతల్లో సీట్లు భర్తీచేస్తారు. శుక్రవారం దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు.
వర్సిటీల్లో డిగ్రీ పరీక్షలు ఇంకెప్పుడు..? ; బీజేపీ నేత రాణి రుద్రమ ఫైర్
హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కేయూ, టీయూ, శాతవాహన, పాలమూరు, ఎంజీయూ పరిధిలో డిగ్రీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్లో ఆమె మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి కీలకమైన విద్యాశాఖ, హోంశాఖను తన దగ్గరే ఉంచుకున్నారని, విద్యాశాఖపై ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు. ల