Insurance | దేశంలో సెకండ్-హ్యాండ్ కార్ మార్కెట్ నానాటికీ పెరుగుతూపోతున్నది. ఒక్క గత ఏడాదే 54 లక్షలకుపైగా యూజ్డ్ కార్లు రీ సేల్ అయ్యా యి. 2024 మొత్తంగా అమ్ముడైన కొత్త కార్ల కంటే ఇవి ఎక్కువ కావడం గమనార్హం. 41 లక్షలుగానే ఉన్నాయి మరి. ధర తదితర అంశాలు ఈ ట్రెండ్‌కు కారణం. అయితే సెకండ్ హ్యాండ్లో కారును కొంటున్నారుగానీ.. చాలామంది ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. అదే బీమా పాలసీ బదిలీ.
బీమా బదిలీలో చర్చకు తావులేదు
మోటర్ వెహికిల్స్ చట్టం ప్రకారం.. కారును కొన్న తర్వాత 14 రోజుల్లోగా సదరు వాహనం ఓనర్షిప్ కొత్త ఓనర్‌కు తప్పక బదిలీ కావాల్సిందే. అయితే సంబంధిత ఇన్సూరెన్స్‌ను అప్డేట్ చేసుకోవడంలో ఆలస్యమైతే జరిమానాలు, ఇతరత్రా శిక్షల గురించి చట్టంలో స్పష్టత లేదు. కానీ పాత కారును కొన్నాక, దాని బీమా పాలసీని మన పేరు మీదకు మార్చుకోకపోతే.. ఓన్ డ్యామేజీ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే వీలున్నది. ఇందుకు కారణం ఓనర్షిప్ సరిపోలకపోవడమే. కారు కొత్త ఓనర్ పేరు మీద ఉంటే.. ఆ కారు ఇన్సూరెన్స్ మాత్రం ఇంకా పాత ఓనర్ పేరు మీద ఉండటమే ఇక్కడొచ్చిన సమస్య. దీంతో ప్రమాదం జరిగినప్పుడు కొత్త ఓనర్‌పైనే ఆ ఖర్చుల భారం పడే అవకాశాలున్నాయి. ఇక బీమా పాలసీ బదిలీ కాకపోతే కారును కొన్నవారితోపాటు అమ్మినవారికీ రిస్కేనని బీమా ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు. కారు ప్రమాదం బారినపడితే, ట్రాఫిక్ నిబంధనల్ని మీరితే ఉండే న్యాయపరమైన సవాళ్లను పాత ఓనర్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.
బదిలీ ప్రక్రియ ఇదీ..
గుర్తుంచుకోండి..
బీమాను కేవలం ఓ పేపర్ వర్క్గానే చూడవద్దు. వాహనదారులకు ఇది అన్నిరకాల భద్రత అన్నది మరువద్దు. కాబట్టి వాహనాన్ని కొన్నా.. అమ్మినా బీమా అప్డేట్ అన్నది వీలైనంత త్వరగా చేసుకోవాలి. అప్పుడే న్యాయపరమైన ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఆర్థికపరంగా అనవసరపు ఖర్చులనూ అధిగమించవచ్చు.