నార్నూర్ : ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు( Soyam Bapurao) సొంత రాజకీయాల కోసం ఆదివాసీలను బలి చేస్తున్నారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ( Tudundheba ) నాయకులు ఆరోపించారు. మాజీ ఎంపీకి వ్యతిరేకంగా శనివారం నార్నూర్ మండల కేంద్రంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ సమాజంలో ఒక మాతృ సంఘంగా తుడుం దెబ్బ కొనసాగుతు వస్తుందని వెల్లడించారు.
తుడుందెబ్బ కారణంగానే ఎమ్మెల్యేగా, ఎంపీగా సోయం బాపురావు గెలిచిన విషయాన్ని మరిచిపోయారని పేర్కొన్నారు. తుడుందెబ్బకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీ సమాజ సంఘాలను సర్వ నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఊసరవెల్లిలో పార్టీలు మారుస్తూ ప్రజల్లో విశ్వాసం కోల్పో మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు.
సోయం బాపూరావును కాంగ్రెస్ నుంచి బర్తరఫ్ చేయాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు పెందోర్ దాదిరావు , జిల్లా ఉపాధ్యక్షులు మెస్రం మానిక్ రావు, నార్నూర్ మండల అధ్యక్షులు ఆడ శ్రీరం , కార్యనిర్వాహణ అధ్యక్షులు మాడవి సాగర్ , ఉపాధ్యక్షులు ఆత్రం పరమేశ్వర్, ప్రచార కార్యదర్శి మెస్రం మోతిరాం నాయకులు మాడవి ఆనంద్ రావు యేత్మారావు, కుమ్ర చాతృరా, జూజ్ఞాక భీంరావ్, కొట్నాక శ్రీరామ్, ఆత్రం రామేశ్వర్, మెస్రం జంగు, కొడప మహేష్ ,మెస్రం జగజీవన్,మెస్రం నగేష్ , మెస్రం శేఖర్ , కొట్నాక జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.