KTR | కాంగ్రెస్ శ్రేణుల దాడిలో మృతిచెందిన తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య కుటుంబాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. రూ.5 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల ప్రభుత్వంలో తుంగతుర్తిలో శాంతి వెల్లివిరిసిందని అన్నారు. అందరి సంతోషం కోసం కలిసి పనిచేశామని తెలిపారు. పేదల కడుపు నింపడం కోసం పనిచేశామన్నారు. అన్నదాతలకు నీళ్లు ఇవ్వడానికి కృషి చేశామని.. తుంగతుర్తికి కాళేశ్వరం నీళ్లు తెచ్చామని గుర్తుచేశారు.
ఇప్పుడు మాత్రం దారుణమైన పరిస్థితులు ఉన్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తను దారుణంగా హత్య చేశారని తెలిపారు. ఇక్కడ అధికార దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లమ్మగూడెం గ్రామంలో మా సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేశారని.. అతనితో మూత్రం తాగించి, దాష్టీకం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిరేకల్‌లో ఓట్లు గల్లంతు చేశారని అన్నారు. ఉత్తమ్ ఏరియాలో అయితే అరాచకాలు చేస్తున్నారని.. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు అందర్నీ గౌరవించామని.. ఎక్కడ దాడులు చేయలేదన్నారు. మేం సంయమనం కోల్పేతే మీరు మిగలరు అని హెచ్చరించారు. మా సహనాన్ని పరీక్షించవద్దని సూచించారు. కాంగ్రెస్ గుండాల్లారా తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.
మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మల్లయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుతంత్రాలు చేసినా, ఇవాళ రాష్ట్రంలో 50 శాతం సర్పంచ్‌లను గెలుచుకున్నామని తెలిపారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ శ్రేణుల దాడిలో మృతి చెందిన తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందచేసిన కేటీఆర్
🔸తుంగతుర్తి… pic.twitter.com/Z8lxXcJkNN
— BRS Party (@BRSparty) December 14, 2025