Mowgli Movie | యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘మోగ్లీ’ బాక్సాఫీస్ వద్ద బోణీ అదిరింది. యువ దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 13, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తోంది. ‘మోగ్లీ’ తొలి రోజే కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే ఈ చిత్రం రూ. 1.22 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా వెల్లడించింది. ప్రీమియర్ షోలతో కలిపి ఈ మొత్తం కలెక్షన్స్ నమోదు అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా, “వైల్డ్ బ్లాక్బస్టర్” అంటూ చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రోషన్, సాక్షిలతో పాటు బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
#Mowgli gets off to a phenomenal start at the box office 🏇❤️
Wild Blockbuster #Mowgli2025 grosses ₹1.22 crore worldwide on Day 1, including premieres ❤️🔥❤️🔥
A @SandeepRaaaj Cinema
A @Kaalabhairava7 musical 🎵🌟ing @RoshanKanakala, @SakkshiM09 &… pic.twitter.com/WfhjIIEMgY
— People Media Factory (@peoplemediafcy) December 14, 2025