తిరుపతి : టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ( Annaprasadam Trust) కు రూ.10 లక్షలు, ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాల ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉంటున్న ఐటీ సంస్థ యజమాని ససపు శ్రీనివాస్ ఈ విరాళాలను అందజేశారు. ఈ మేరకు డీడీలను ఈవో ఎం. రవిచంద్రకు శనివారం తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం అందించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నంకు చెందిన చీఫ్ ఇంజనీర్ డి. శ్రీనివాస్ రావు, రైల్వే అధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .