హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు శ్రీనివాసులురెడ్డి టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళాన్ని సోమవారం అందించారు. తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరిని కలిసి డీడీని అందించారు. నిరుడు టీటీడీలోని వివిధ పథకాలకు శ్రీనివాసులురెడ్డి రూ.30 లక్షల విరాళాలను అందజేశారు. శ్రీనివాసులురెడ్డిని అదనపు ఈవో అభినందించారు.