Epstein files | ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) సెక్స్ కుంభకోణం కేసు అమెరికాను కుదిపేస్తోంది. తన పరపతి పెంచుకోవడం కోసం జెఫ్రీ ఏళ్ల తరబడి టీనేజ్ అమ్మాయిలను ఎరగా వేశాడు. 2002-2005 మధ్య కాలంలో మైనర్ బాలికలను, యువతులకు డబ్బు ఆశ చూపించి తన మాన్‌హట్టన్ భవనం, పామ్ బీచ్ ఎస్టేట్, ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ ఆరోపణలతో 2019 జులైలో ఎప్స్టీన్ను అరెస్ట్ చేశారు. ఇక అదే ఏడాది ఆగస్టు 10న మాన్‌హట్టన్ జైలు గదిలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన సన్నిహితుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సహా, మాజీ అధ్యక్షులు, రాజకీయ, వ్యాపార వేత్తలు కూడా ఉన్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. దీంతో ఎప్స్టీన్కు సబంధించిన అన్ని అంశాలు బహిర్గతం చేయాలని ఇటీవల అమెరికా న్యాయ శాఖ ఆదేశాలు ఇవ్వడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల బిల్లును మంగళవారం ప్రతినిధుల సభ ముందుకు తీసుకురాగా.. 427-1 ఓట్లతో ఆమోదం లభించింది. తర్వాత సెనెట్‌లో దీనికి ఏకగ్రీవ ఆమోదం లభించడంతో.. తాజాగా ట్రంప్ దానిపై సంతకం చేశారు. ఇక ఈ ఫైల్స్ లిస్ట్‌లో పలువురి రాజకీయ నేతలు, జర్నలిస్ట్‌లు, వ్యాపారవేత్తలు, బిజినెస్ అండ్ టెక్ టైకూన్స్, సినిమా వాళ్ల పేర్లు తెరపైకి వచ్చాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, లారీ సుమ్మర్స్, యూఎస్ హెల్త్ సెక్రెటరీ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ , బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III సోదరుడు ప్రిన్స్ ఆండ్రూ, ప్రముఖ జర్నలిస్ట్ మైఖేల్ వోల్ప్, పెగ్గీ సీగల్, ప్రముఖ ప్రొఫెషర్ నోమ్ చోమ్స్కీ, ప్రముఖ న్యాయవాది అలాన్ డెర్షోవిట్జ్, హెడ్జ్ ఫండ్ మేనేజర్ గ్లెన్ డుబిన్, వైట్ హౌస్ మాజీ కౌన్సెల్ కాథరిన్ రూమ్మ్లర్, బిలియనీర్ ఎలాన్ మస్క్, పీటర్ థీల్, టామ్ ప్రిట్జ్కర్, సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఫ్రెడరకి ఫైక్కై, పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్, ప్రముఖ సింగర్ కోర్ట్నీ లవ్, మోడల్ నవోమి కాంప్‌బెల్, ప్రముఖ హాస్య నటుడు క్రిస్ టక్కర్, ట్రంప్ మాజీ భార్య మార్లా మాపుల్స్, ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్ సహా పలువురు ప్రముఖుల పేర్లు లిస్ట్‌లో ఉన్నట్లు అమెరికా మీడియా నివేదించింది.
Also Read..
NASA | అంగారకుడిపై మిస్టీరియస్ ఎలియన్ రాక్‌ను గుర్తించిన నానా..!
ప్రపంచంలో తొలిసారిగా ఓ వ్యక్తికి హెచ్5ఎన్5 బర్డ్ ఫ్లూ