WhatsApp | ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఐఓఎస్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకువస్తున్నది. దాంతో ఒకే డివైజ్‌లో రెండు వాట్సాప్ అకౌంట్స్‌ను వాడుకునే సౌకర్యం అందుబాటులోకి తేబోతున్నది. ఈ అప్డేట్ ఐఓఎస్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వేర్వేరు వ్యక్తిగత, ప్రొఫెషనల్ నంబర్లు ఉన్న వారికి మంచి ఆప్షన్‌గా మారనున్నది. ప్రతి అకౌంట్ చాట్ హిస్టరీ, బ్యాకప్స్, ప్రైవసీ సెట్టింగ్స్ భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఒక వాట్సాప్ అకౌంట్లో ఏదైనా మెసేజ్ వచ్చిన సమయంలో.. నోటిఫికేషన్ ఏ అకౌంట్ నుంచి వచ్చిందో సైతం స్పష్టంగా చూపిస్తుంది.
సెక్యూరిటీ ఫీచర్స్‌ను మార్చే సమయంలో యాప్ లాక్ (ఫేస్ ఐడీ, పాస్‌కోడ్) సపోర్ట్ సైతం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరిమిత సంఖ్యలో యూజర్లకు టెస్టింగ్ దశలో అందుబాటులో ఉంది. విజయవంతమైతో త్వరలోనే రోలవుట్ చేసే ఛాన్స్ ఉంది. చాలా మంది ఐఫోన్స్ యూజర్స్ రెండు నంబర్లు వ్యక్తిగత, ఫ్రొఫెషనల్ నంబర్స్‌ను వినియోగిస్తున్నారు. కొత్త ఫీచర్‌తో వాట్సాప్ బిజినెస్ వంటి యాప్‌ల అవసరం తక్కువగా ఉంటుంది. సజావు ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కి మారడం, ప్రతి అకౌంట్‌కు సొంతంగా ఐడెంటిటీ ఉంటుంది. వాస్తవానికి చాలాకాలంగా ఐఓఎస్‌లో ఇలాంటి ఫీచర్ కోసం డిమాండ్ ఉన్నది. కొత్త ఫీచర్ కారణంగా వాట్సాప్ యూజర్లు మరింత నియంత్రణ, ఫ్లెక్సిబులిటి ఇస్తుంది. ప్రస్తుతం బీటా వెర్షన్లో ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. అకౌంట్‌ను జోడించేందుకు రెండో నంబర్ అవసరమవుతుంది. అప్డేట్, టెస్ట్ ఫ్లైట్ ఇన్స్టాలేషన్ అవసరం అయ్యే అవకాశం ఉంది.