వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించి విడుదలవుతున్న డాక్యుమెంట్లతో ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్కు చెందిన ప్రైవేట్ జెట్లలోని కనీసం ఎనిమిది విమానాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణించిన విషయం తాజా డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైంది.
ఆయన విమాన ప్రయాణికుడిగా నమోదై ఉన్న విషయం మంగళవారం అమెరికా న్యాయ శాఖ వెబ్సైట్లో విడుదల చేసిన డాక్యుమెంట్ల ద్వారా నిర్ధారణ అయ్యింది.