ముంబై, ఫిబ్రవరి 11 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు తెరపడింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, వాహన రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో సూచీలు నష్టపోయాయి. 84,487 నుంచి 84,0 487 పాయింట్ల శ్రేణిలో కదలాడిని 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 40 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 84,233. 64 వద్ద ముగిసింది.
నిఫ్టీ మాత్రం 18.70 పాయింట్లు లాభపడి 25,953. 85 పాయింట్ల వద్ద స్థిరపడింది. 30 షేర్ల ఇండెక్స్ సూచీల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీ, ఎటర్నల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి.