ముగిసిన డాలర్ శేషాద్రి అంత్యక్రియలు

తిరుమల/హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు ముగిశాయి. గుండెపోటుతో కన్నుమూసిన ఆయన అంత్యక్రియలను తిరుపతిలోని సత్యహరిశ్చంద్ర వైకుంఠప్రస్థానంలో మంగళవారం నిర్వహించారు. శేషాద్రి సోదరుడు రామానుజం తలకొరివి పెట్టారు. ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ నేరుగా తిరుపతిలోని డాలర్ శేషాద్రి నివాసానికి చేరుకొని పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు కంచి పీఠం తరపున వచ్చిన ప్రతినిధులు డాలర్ శేషాద్రి భౌతికకాయానికి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు కూడా పార్థీవదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అంతిమయాత్రలో వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి శేషాద్రి పాడెమోశారు.
మాది 25 ఏండ్ల అనుబంధం
డాలర్ శేషాద్రితో 25 ఏండ్ల అనుబంధమున్నది. ఆయన లేని తిరుమలను ఊహించుకోలేకపోతున్నా. శ్రీవారి సేవలోనే తుదిశ్వాస విడవటం శేషాద్రి అదృష్టం. స్వామివారికి శేషాద్రి అత్యంత ప్రియ భక్తుడు. తిరుమల వచ్చినప్పుడల్లా చిరునవ్వుతో పలకరించి స్వామివారి దర్శనం చేయించేవారు. ఇకపై అలాంటి ఆహ్వానం ఉండదనేది నా మనసును కలిచివేస్తున్నది. ఆయన మృతి వ్యక్తిగతంగా నాకు, నా కుటుంబసభ్యులకు ఎంతో నష్టం. డాలర్ శేషాద్రి ఆత్మకు శాంతి కలగాలి. శ్రీవారు ఆయనకు ముక్తిని ప్రసాదించాలి. ఆలయ సంప్రదాయాలపై శేషాద్రి రచించిన పుస్తకాలను టీటీడీ వినియోగించుకోవాలి.- మీడియాతో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థివ దేహం వద్ద మంగళవారం నివాళులు అర్పిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. శేషాద్రి అంతిమ సంస్కారాలు తిరుపతిలోని సత్యహరిశ్చంద్ర వైకుంఠ ప్రస్థానంలో మంగళవారం నిర్వహించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Dollar Seshadri
- Funeral
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

