సైనికులతో కలిసి శునకాల యోగాసనాలు.. ఎక్కడంటే..?
కాంకర్లో ఉన్న జంగిల్వార్ కాలేజీలో ప్రతి ఉదయం దేశీయ, విదేశీ జాతుల కుక్కలు యోగా చేయడం చూడవచ్చు. వివిధ రంగాల్లో పోస్ట్ చేసిన ఈ శునకాలకు ఇచ్చే శిక్షణలో యోగా కూడా ఒక భాగం.

శునకాలు యోగాసనాలు వేయడం గురించి ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? కాని మన దేశంలో సైనికులతో కలిసి యోగా చేసే శునకాలు ఉన్నాయంటే ఆశ్చర్యమేస్తుంది. శునకాలకు యోగా నేర్పే ఏకైక కళాశాల ఛత్తీస్‌గఢ్‌లోని కాంకర్లో ఉన్నది. కాంకర్లో ఉన్న జంగిల్వార్ కాలేజీలో ప్రతి ఉదయం దేశీయ, విదేశీ జాతుల కుక్కలు యోగా చేయడం చూడవచ్చు. వివిధ రంగాల్లో పోస్ట్ చేసిన ఈ శునకాలకు ఇచ్చే శిక్షణలో యోగా కూడా ఒక భాగం. ఇక్కడ శిక్షణ పొందిన శునకాలను రాజ్‌భవన్, హైకోర్టుల్లో భద్రత కోసం నియమిస్తారు. అదేవిధంగా, నక్సలైట్లతో గెరిల్లా యుద్ధం చేయడంలో, అడవిలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ల్యాండ్‌మైన్‌ను గుర్తించడంలో ఈ శునకాలు ఆరితేరి ఉంటాయి.
ఇక్కడ దాదాపు 65 స్వదేశీ, విదేశీ శునకాలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతినిత్యం సైనికులతో పాటు ఈ శునకాలు కూడా యోగా చేస్తాయి. ప్రతి ఉదయం 5.30 నుంచి 6.30 వరకు.. శునకాల శరీరం, మనస్సును ఆరోగ్యంగా ఉంచడానికి శవాసన, శశాంక్ ఆసన, వజ్రాసన, శిర్షాసన, మకరాసనాలు చేయిస్తారు. నిత్యం ఈ యోగా చేయడంతోనే కుక్కలకు శిక్షణ ప్రారంభమవుతుంది. ఇలాంటి శిక్షణ దేశంలో మరెక్కడా లేదు. ఇప్పటివరకు చాలా శునకాలకు శిక్షణ ఇచ్చి వివిధ రంగాల్లో మోహరించారు. ఇక్కడ శిక్షణ పొందిన చాలా కుక్కలు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాయి.
గత 15 సంవత్సరాలుగా ఈ కళాశాలలో కుక్కలకు ఇస్తున్నట్లు బ్రిగేడియర్ బీకే పొన్వర్ తెలిపారు. యోగా సాధన చేసిన శునకాలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వస్తువులను గుర్తించడంలో వాటి మేధస్సు మరింత పదునుగా తయారవుతున్నదని ఆయన పేర్కొన్నారు. తమ వద్ద శిక్షణ పొందిన అనేక శునకాలు వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తున్నాయని, అవి అందుకుంటున్న విజయాలు చూసి గర్విస్తుంటామని పొన్వర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
చరిత్రలో ఈరోజు : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
ఆఫ్ఘాన్‌లో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేస్తాం : తాలిబాన్ ప్రకటన
రామ మందిరం విషయంలో మా ఎంపీవన్నీ అబద్దాలే
ఏడు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర క్యాబినెట్లో మార్పులు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

