కొల్లాపూర్ : ఆర్థిక పరిస్థితులతో వైద్యం అందక సతమతమవుతున్న వృద్ధురాలికి ప్రైవేట్ వైద్యులు తమ వంతుగా వైద్య సహాయం అందించి అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణానికి చెందిన వృద్ధురాలు కాలుకు పూర్తిగా ఇన్ఫెక్షన్ (Leg Infection) సోకి నడవరాని స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. దీనికి తోడు ఆర్థిక స్తోమత లేకపోవడంతో వైద్యానికి దూరంగా ఉంటుంది.
ఈ సమయంలో కుటుంబ సభ్యులు స్థానిక మమత హాస్పిటల్‌లోని స్పెషలిస్ట్ వైద్యులు రెడ్డి దిలీప్‌కుమార్( Reddy Dileep Kumar ) , ఉషారాణి( Usharani ) ని సంప్రదించగా ఇద్దరు వృద్ధురాలిని పరీక్షించి వైద్యం చేశారు. మానవతా దృక్పథంతో ఆలోచించి అతి తక్కువ ఫీజుతో పూర్తిగా ఇన్ఫెక్షన్కు గురైన కాలును తీసివేసి ఆపరేషన్ చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు.
గురైన , చిన్న దెబ్బలు తగిలిన వెంటనే చికిత్స చేయించుకుంటే ఫలితం ఉంటుందని వారు వెల్లడించారు. వృద్ధురాలికి ఆపరేషన్ చేసిన వైద్య బృందానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.