Sanju Samson : పొట్టి వరల్డ్‌కప్ హీరో సంజూ శాంసన్ (Sanju Samson) తన తొలి ప్రసంగంతోనే చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) అభిమానులను ఆకట్టుకున్నాడు. పంతొమ్మిదో సీజన్లో చెన్నైకి ఆడుతున్న సంజూ ఫ్రాంచైజీ నిర్వహించిన ‘ROAR 26’ కార్యక్రమంలో శాంసన్ తమిళంలో ‘థత్రోమ్ థూక్రోమ్’ అనే డైలాగ్ చెప్పాడు. పసుపు జెర్సీలతో నిండిపోయిన చెపాక్ స్టేడియంలో అడుగుపెట్టిన సంజూ.. ఈ డైలాగ్ చెప్పగానే ఫ్యాన్స్ శాంసన్, శాంసన్ అని గట్టిగా అరిచారు.
ఐపీఎల్ ఆరంభం నుంచి తమ జట్టుకు మద్దతిస్తున్న అభిమానుల కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ‘ROAR 26’ అనే స్పెషల్ లైవ్ షో నిర్వహించింది. ఆదివారం చిదంబరం (చెపాక్) స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్‌కు మాజీ సారథి ఎంఎస్ ధోనీ, శాంసన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సహా మాజీ ఆటగాళ్లు సురేశ్ రైనా, మాథ్యూ హెడేన్, మురళీ విజయ్, బద్రీనాథ్ తదితరులు హాజరయ్యారు.
𝐓𝐡𝐚𝐭𝐫𝐨𝐦 𝐓𝐡𝐨𝐨𝐤𝐫𝐨𝐦 – Sanju Samson 🦁
#Roar26 #WhistlePodu pic.twitter.com/cXU3NuvtgO— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2026
ఈ సందర్బంగా వరల్డ్‌కప్ విజయంలో కీలకమైన సంజూ శాంసన్, శివం దూబేలను ధోనీ సత్కరించాడు. అనంతరం సంజూ మాట్లాడుతూ ‘థత్రోమ్ థూక్రోమ్’అనే తమిళ డైలాగ్‌తో తన ఆట తీరును వివరించాడు. ‘బంతిని చూసి కొడతాను. సాధ్యమైనన్ని సిక్సర్లు బాదడమే నా లక్ష్యం’ అని ఒక్క ముక్కలో తన బ్యాటింగ్ స్టయిల్‌ను వెల్లడించాడీ హిట్టర్. ఎల్లో జెర్సీ వేసుకోవడమే కాదు.. తమిళంలోనూ తన ఆట స్టయిల్‌ను వివరించిన సంజూ సీఎస్కే ఆర్మీ మనసులు దోచుకున్నాడు. అనంతరం ఈ నైట్ షోలో సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) తన పాటల హోరుతో ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు.
World champions honoured by the man himself 🥳🏆#Roar26 #WhistlePodu pic.twitter.com/eiy8oKoQZQ
— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2026