Chennai Super Kings : ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మాజీ ఆటగాళ్లకు ప్రత్యేక గౌరవం లభించింది. ఒకప్పుడు తమదైన విధ్వంసక ఆటతో సీఎస్కే విజయాల్లో సురేశ్ రైనా(Suresh Raina), మాథ్యూ హేడెన్ (Mathew Heyden)కు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించింది. ఆదివారం చెపాక్ స్టేడియంలో అభిమానుల కోలాహలం నడుమ సందడిగా జరిగిన ROAR 26 కార్యక్రమంలో వీరిద్దరిని యాజమాన్యం ప్రత్యేక జ్ఞాపికలు అందజేసింది. మాజీ క్రికెటర్ల కోసం నిర్వహించిన సీఈవో కాశీ విశ్వనాథన్, వీరికి జ్ఞాపికలు అందజేశారు.
ఐపీఎల్లో ఏ జట్టుకు లేనంత అభిమానగణం చెన్నై సూపర్ కింగ్స్ సొంతం. అందుకే తమ ఫ్యాన్స్ కోసం పంతొమ్మిదో సీజన్‌కు ముందర నైట్ లైవ్ షో నిర్వహించింది సీఎస్కే. ‘ROAR 26’ పేరుతో ఆదివారం చిదంబరం (చెపాక్) స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్లో సురేశ్ రైనా, మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్లకు హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం దక్కింది.
Suresh Raina | Matthew Hayden
Hall of Fame Inductees 🦁#WhistlePodu #Roar26 pic.twitter.com/3MYBwPSWuI— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2026
ఫ్రాంచైజీకి విశేష సేవలందించిన చిన్న తాలా రైనాకు సీఈఓ కాశీ విశ్వనాథన్, హెడేన్కు డైరెక్టర్ రూప గురనాథ్ మెమొంటో అందజేశారు. ఆరంభ సీజన్ నుంచి సీఎస్కేకు ఆడిన రైనా పదమూడేళ్లు ధోనీతో కొనసాగాడు. ధోనీ సారథ్యంలో చెన్నై టీమ్ నాలుగు ఐపీఎల్ టైటిళ్ల విజయంలో కీలకమయ్యాడీ లెఫ్ట్ హ్యాండర్. మూడు సీజన్లు (2008-10)మాత్రమే సీఎస్కేకు ఆడిన హేడెన్ 2009లో ఆరెంజ్ క్యాప్ గెలుపొందాడు.
‘ROAR 26’ కార్యక్రమానికి మాజీ సారథి ఎంఎస్ ధోనీ, శాంసన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సహా మురళీ విజయ్, బద్రీనాథ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వరల్డ్‌కప్ విజయంలో కీలకమైన సంజూ శాంసన్, శివం దూబేలను ధోనీ సత్కరించాడు.