Beverages Corporation Stores Officers : తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పోరేషన్ స్టోర్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పోరాడాలని తీర్మానించారు. తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పోరేషన్ స్టోర్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం, జనరల్ బాడీ మీటింగ్ ఆదివారం బోడుప్పల్‌లోని హైవా హోటల్లో జరిగింది.
రాష్ట్రంలో వివిధ మద్యం డిపోలలో పనిచేస్తున్న ఉద్యోగులు, అబ్కారీ భవన్ ప్రధాన కార్యాలయం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని పరిష్కరించుకోడానికి ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశాలపై దృష్టా సారించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్‌ను కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా కోరతామని వారు పేర్కొన్నారు.
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ స్టోర్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశానికి అధ్యక్షుడిగా రామకృష్ణ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్లు గంగా, ధీరజ్, లక్ష్మణ్, జనరల్ సెక్రెటరీ యాకూబ్ నాయక్, కోశాధికారి శివకుమార్, కో-ఆర్డినేటర్ ఆనంద కుమార్, విఠల్, ఝాన్సీ, బాలచందర్, తదితరులు పాల్గొన్నారు.