Beauty tips : సాధారణంగా ఏదైనా ఫంక్షన్‌కో, పార్టీకో వెళ్లాలంటే మగవాళ్లు షర్ట్, ప్యాంట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ ఆడవాళ్ల అలంకరణ అంత ఈజీగా పూర్తికాదు. చక్కగా డ్రెస్ వేసుకోవాలి. కేశాలంకరణ చేసుకోవాలి. ముఖానికి ఫౌడర్లు వేయాలి. కళ్లకు ఐ లైనర్ రాయాలి. పెదాలకు లిప్‌స్టిక్ పెట్టాలి. ఇంకా వగైరా వగైరా ఎన్నో ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ తీరా ఫంక్షన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత మేకప్‌ను తీసేయడంలో మాత్రం చాలామంది బద్దకిస్తారు. మేకప్ అలాగే ఉంచుకుని నిద్రపోతారు. కానీ ఈ అలవాటు మంచిది కాదని, అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.