World’s Oldest Trees | సాధారణంగా మర్రి చెట్లు వందల ఏళ్లు జీవిస్తాయని చెబుతుంటారు. ఎక్కువ వయసు ఉన్న చెట్లు అవే కనిపిస్తుంటాయి. పెద్ద పెద్ద ఊడలతో.. పెద్ద పెద్ద మొండాలతో అవి కనిపిస్తుంటాయి. అయితే.. మర్రి చెట్టు కంటే కూడా.. తాతల చెట్లు.. ముత్తాతల చెట్లు ఈ ప్రపంచంలో ఉన్నాయి. కొన్ని వేల ఏళ్ల నుంచి అవి మనుగడ సాగిస్తున్నాయి. ఇంతకీ ఆ చెట్లు ఏంటి. ఎక్కడ ఉన్నాయి.. అనే విషయాలు తెలుసుకుందాం రండి.
ఈ చెట్టు పేరు Old Tjikko. చూడటానికి ఒక మొక్కలా ఉంది కదా. కానీ.. ఈ చెట్టు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ చెట్టు. ఇది స్వీడన్లో ఉంది. దీని వయసు ఎంతో చెబితే మీ కళ్లు గిర్రున తిరుగుతాయి. 9550 ఏళ్ల వయసు దీనిది.
ఇక.. ఈ చెట్టు పేరు Methuselah. ఇది కూడా అత్యంత ఎక్కువ వయసు ఉన్న చెట్లలో ఒకటి. దీని వయసు 5 వేల సంవత్సరాలు. కాలిఫోర్నియాలో ఉంది ఈ చెట్టు.
ఈ చెట్టు పేరు Llangernyw Yew. ఈ చెట్టు ఇంగ్లండ్‌లోని నార్త్ వేల్స్లో ఉంది. దీనికి 4 వేల సంవత్సరాల వయసు ఉంటుందట. మీకు ఇంకో విషయం తెలుసా. ఈ చెట్టు ఇప్పటికీ పెరుగుతూనే ఉందట.
ఈ చెట్టు పేరు Zoroastrian Sarv. ఈ చెట్టు వయసు 4 వేల ఏళ్లు. ఇది ఇరాన్లో ఉంది. ఏసియాలో ఇదే ఎక్కువ వయసు కలిగిన చెట్టు.