హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మలాజిగిరి జిలా,్ల కొర్రేముల (వెంకటాపూర్) గ్రామం, నాదం చెరు వు సమీపంలో అనురాగ్ యూనివర్సిటీ ఆక్రమణలు ఉన్నాయని చెప్పి చట్ట వ్యతిరేకంగా చర్యలు తీసుకోరాదని హైడ్రాకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఏ విధమైన చర్యలు చేపట్టాలన్నా చట్ట నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఆక్రమణలపై అభియోగాలు ఉంటే వాటిని నిర్ధారణ వ్యవహారంపై హైడ్రా చట్ట నిబంధనలకు అనుగుణంగా నోటీసులు జారీ చేయాల్సిందేనని ఉత్తర్వులు జారీచేసింది. అక్రమణలు ఉన్నట్లయితే వాటి తొలగింపును చట్టప్రకారం చేపట్టాలని పేర్కొంది. వెంకటాపూర్ గ్రామ సర్వే నం.813 నాదం చెరువు బఫర్ జోన్లో ఏమైనా నిర్మాణాలు ఉన్నట్టయితే వాటి విషయంలో చట్ట ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేసింది.
అధికారులు తమ హకుల్లో జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, అ నురాగ్ యూనివర్సిటీ, నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శనివారం అత్యవసరం గా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశా యి. వీటిపై శనివారం రాత్రి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ వినోద్‌కుమార్ విచారణ జరిపారు. యూనివర్సిటీతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కుటుంబానికి ప్రమేయం ఉన్నదని చెప్పి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం తరపు న్యాయవాది రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి చర్యలు చేపట్టకముందే పిటిషనర్ ఆందోళనతో కోర్టుకు వచ్చారని చెప్పారు.