KU | కేయూ సెక్యూరిటీ ఏజెన్సీని ఆంధ్రాకు ఇవ్వద్దు: విద్యార్థి సంఘాలు
KU | కాకతీయ యూనివర్సిటీ సెక్యూరిటీ బాధ్యతలను ఆంధ్ర ఏజెన్సీకి ఇవ్వద్దు. తెలంగాణ వారికి అవకాశం కల్పించాలని విద్యార్థి సంఘాల నాయకులు వీసీ చాంబర్లో నిరసన తెతెలిపారు.
KU | హనుమకొండ చౌరస్తా: కాకతీయ యూనివర్సిటీ సెక్యూరిటీ ఏజెన్సీ (Security Agency)ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఇవ్వద్దు అని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ చాంబర్లో ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఏజెన్సీలకు కేయూ సెక్యూరిటీ ఏజెన్సీని అప్పగిస్తే పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని, అవసరమైతే యూనివర్సిటీ బంద్కు పిలుపిస్తామని వారు యూనివర్సిటీ అధికారులను హెచ్చరించారు. సెక్యూరిటీ ఏజెన్సీని తెలంగాణ ప్రాంతవాసులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కేయూ సెక్యూరిటీ ఏజెన్సీని తెలంగాణప్రాంత వాసులకే ఇస్తామని వైస్ చాన్స్లర్ (VC) హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో డెమొక్రటిక్ స్టూడెంట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ర్ట కన్వీనర్ కామగోని శ్రావణ్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు కుమ్మరి శ్రీనాథ్ మాదిగ, స్వేరో స్టూడెంట్స్యూనియన్ ఎస్ఎస్యూ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ స్వేరో, నాయకులు ఉప్పుల శివ, చెట్టుపల్లి శివకుమార్, గుండా వంశీ, వివేక్ , జగదీష్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

