చెన్నై : బీజేపీ నేత శశికళా పుష్పను ఓ కార్యక్రమంలో కాషాయ నేత లైంగిక వేధింపులకు గురిచేసిన వీడియో బయటకువచ్చింది. డీఎంకే ఐటీ విభాగం రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి ఇసై దక్షిణామూర్తి ఈ వీడియోను తన సోషల్ మీడియా వేదికపై షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
ఈ వీడియోలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్ బాలగణపతి శశికళ పుష్ప చీరను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆమె తోసివేసినట్టు కనిపించింది. ఆపై పొన్ బాలగణపతి ఆమె ఎడమ చేతిని తాకేందుకు ప్రయత్నించాడు.
பாஜகவில் சேரும் பெண்கள், தங்களை பாஜகவினரிடம் இருந்து தற்காத்துக் கொள்வதே பெரும் போராட்டம் தானா? @annamalai_k #ShameOnBJP pic.twitter.com/lNZXVTCKYY
— இசை (@isai_) September 13, 2022
బీజేపీలో చేరిన మహిళలు ఆ పార్టీ నేతల నుంచి తమను తాము కాపాడుకోవడానికి పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోందా అనే క్యాప్షన్‌తో డీఎంకే నేత ఈ వీడియోను షేర్ చేశారు. రామనాధపురం జిల్లాలో దళిత నేత ఇమ్మానుయేల్ శేఖరన్ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమానికి శశికళ పుష్ప హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోపై పొన్ బాలగణపతి ఇంతవరకూ స్పందించలేదు.