DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం ఆయన చేతకానితనానికి నిదర్శనమని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఢిల్లీకి మూటలు పంపడం ఆపేస్తే రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సరిపోతాయని వ్యాఖ్యానించారు.
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం ఆయన చేతకానితనానికి నిదర్శనమని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఢిల్లీకి మూటలు పంపడం ఆపేస్తే రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సరిపోతాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. ఓటు చోరీ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
ఓటు చోరీ జరిగి ఉంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేదని డీకే అరుణ అన్నారు. డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు తొలగించకూడదా? అని ప్రశ్నించారు. దేశంలో అరాచకం సృష్టించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశ విచ్ఛిన్నకర శక్తులు యువతను రెచ్చగొడుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కొడంగల్ నియోజకవర్గంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తాన్ని అభివృద్ధి చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. స్థానికుడు కాకపోయినా రేవంత్ రెడ్డిని కొడంగల్ ప్రజలు గెలిపించారని గుర్తుచేశారు. అయితే నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని విమర్శించారు. బాధితులకు వెంటనే పరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరారు.
గత రెండేళ్లలో కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు కేటాయించినట్లు ఎంపీ వివరించారు. అమృత్ పథకం కింద రూ.2.22 కోట్లు, ఎంపీ నిధుల నుంచి రూ.1.45 కోట్లతో రోడ్లు, కమ్యూనిటీ హాల్, హైమాస్ట్ లైట్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. పీఎం శ్రీ పథకం కింద రూ.79.50 లక్షలు, ఉపాధి హామీ పథకం కింద రూ.69.75 లక్షలు, వీబీ-జీ రామ్ జీ కింద రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేసినట్లు వెల్లడించారు.
పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని డీకే అరుణ కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటి అప్రోచ్‌ను నార్లాపూర్‌కు మార్చడం ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాంతానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. మొదటి డీపీఆర్‌లో పేర్కొన్న జూరాల నీటి అప్రోచ్‌తోనే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టును ఆలస్యం చేయకుండా పూర్తి చేసి ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు అందించాలని కోరారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే పాలమూరు జిల్లాకు అన్యాయం చేసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి చరిత్రలో మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. అవసరమైతే కేంద్రం వద్దకు కలిసి వెళ్లి ప్రాజెక్టుకు నిధులు కోరుదామని అన్నారు.
KADAకు కొండారెడ్డిపల్లి నుంచి నిధులు రావడం లేదని, దానికంటూ ప్రత్యేక నిధులు కూడా లేవని డీకే అరుణ విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను మళ్లించి KADAకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల అప్రోచ్‌తో పనులు చేపట్టాలని మరోసారి డిమాండ్ చేశారు.
నవంబర్ 2న హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర
ప్రజాస్వామ్య పరిరక్షణ, అరాచకవాదానికి వ్యతిరేకంగా నవంబర్ 2న హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు డీకే అరుణ తెలిపారు. నిజాం కాలేజీ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మోజంజాహీ మార్కెట్ వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటారని వెల్లడించారు. ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం.. అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
Jajula Srinivas Goud | బీసీ కులగణనపై అమిత్ షా స్పందించాలి.. దేశవ్యాప్త ఉద్యమం ఆపేది లేదు: జాజుల
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

