రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
మలక్పేట, మార్చి 16: అసెంబ్లీ సాక్షిగా భారీ సంఖ్యలో ఉద్యోగాలు ప్రకటించి, దివ్యాంగుల వయోపరిమితిని పదేండ్లకు పెంచటంపై రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. దివ్యాంగుల పరిస్థితులను అవగతం చేసుకొని సానుకూల నిర్ణయం తీసుకొన్నందుకు రాష్ట్ర వికలాంగుల తరఫున బుధవారం సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 3 వేల మంది వెన్నుపూస సంబంధిత, 5 వేల మంది కండరాల క్షీణత వ్యాధిగ్రస్థులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, వారికి ప్రభుత్వం తరఫున ఉచితంగా మందులు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్కు వినతిపత్రాన్ని అందజేయగా, సీఎం సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.