‘వారణాసి’ షూటింగ్‌ను చకచకా పరుగులు పెట్టిస్తున్నారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటికే సౌతాఫ్రికాలోని దట్టమైన అడవుల్లో, ఐరోపా మంచు కొండల్లో.. జార్జియా, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో నెలల తరబడి మకాం వేసి మరీ 70శాతం చిత్రీకరణను పూర్తి చేశారు రాజమౌళి. కథానుగుణంగా వీటిలోని కొన్ని ప్రాంతాల్లో మహేష్ సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తారట. ఓ ఎపిసోడ్లో లాంగ్ హెయిర్‌తో, మరో ఎపిసోడ్లో గడ్డంతో కనిపిస్తారని, అది కూడా కథలో భాగమేనని మేకర్స్ చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి ఈ కథలో బోల్డంత ప్రాధాన్యత ఉన్నా కూడా, సహజత్వం కోసం ఎక్కువశాతం లైవ్ లొకేషన్స్‌లోనే రాజమౌళి చిత్రీకరణ జరిపినట్టు తెలిసింది.
ఇక తదుపరి షెడ్యూల్ వివరాల్లోకెళ్తే.. ఈ షెడ్యూలంతా వారణాసిలోనే జరుగుతుందట. గంగాఘాట్లలో కీలక సన్నివేశాలను చిత్రికరించబోతున్నారట. అలాగే.. కాశీలోని కొన్ని పురాతన కట్టడాలు, గంగాహారతి, కాశీ పురవీధుల్లో మహేష్ యాక్షన్ సన్నివేశాలు ఈ షెడ్యూల్లో పూర్తి చేస్తారట. దీంతో షూటింగ్ దాదాపు పూర్తవుతుందని తెలిసింది. తర్వాత ఈ గ్లోబల్ అడ్వెంచర్ కోసం వియత్నాం, థాయిలాండ్ల్లోని జలపాతాలు, గుహల నేపథ్యంలో కొన్ని సాహసోపేతమైన సన్నివేశాలను తీస్తారట. దాంతో సినిమా పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.