గమ్యం, వేదం, కృష్ణంవందేజగద్గురుమ్, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలతో అభిరుచిగల దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల నుంచి కితాబులందుకున్నారు దర్శకుడు క్రిష్. ఆయితే ఎన్టీఆర్ బయోపిక్‌లు, కొండపొలం, హరిహరవీరమల్లు, ఘాటీ చిత్రాల ఫలితాలు ఆయన కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలోనే తన కంబ్యాక్‌పై దృష్టిపెట్టారు క్రిష్. తాను చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ మరింత కొత్తగా, ప్రత్యేకంగా ఉండేలా ఆయన ప్లాన్ చేసినట్టు వినికిడి.
ఏకంగా ఏడుగురు హీరోయిన్లతో క్రిష్ ఓ సినిమా చేయబోతున్నారట. అయితే.. ఆ ఏడుగురు భామలెవరు? అనేది మాత్రం క్లారిటీ లేదు. కథ ఇప్పటికే పూర్తయిందని, హీరోయిన్ల ఎంపికలో క్రిష్ బిజీగా ఉన్నారని, మహిళా పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ క్రిష్ చేస్తున్న ఈ సినిమా ట్రెక్కింగ్ నేపథ్యంలో ఉంటుందని, ప్రకృతి, భావోద్వేగాలు, వ్యక్తిగత ప్రయాణాలు, మానసిక సంఘర్షణల కలబోతగా ఈ సినిమా రూపొందనున్నదని తెలిసింది.