హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తేతెలంగాణ) : సినీనిర్మాత దిల్‌రాజు సినీ ఇండస్ట్రీ పక్షమా?.. కాంగ్రెస్ పక్షమా?’ అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ‘సినీ పరిశ్రమ పరువుతీస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరును ప్రశ్నించిన కేటీఆర్‌పై దిల్‌రాజు విమర్శలు చేయడం సబబు కాదని పేర్కొన్నారు. నటులపై సీఎం వ్యాఖ్యాలను ఆయన సమర్థిస్తున్నారా? హీరో నాగర్జున, సమంతపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై వైఖరేమిటో చెప్పాలని ప్రశ్నించారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన దిల్‌రాజు ఎవరికి మద్దతుగా వెళ్లారని నిలదీశారు. సంధ్య థియేటర్ ఘటనలో తప్పు ప్రభుత్వానిదా? లేదా అల్లు అర్జున్‌దా?.. ఈ విషయంపై దిల్‌రాజు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.