తల్లి కాబోతున్న దియా మీర్జా
దియా మీర్జా | ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా తన అభిమానులకు తీపికబురు అందించింది. తాను తల్లిని కాబోతున్నానని ఇన్‌స్టా వేదికగా చెప్పింది దియా.

ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా తన అభిమానులకు తీపికబురు అందించింది. తాను తల్లిని కాబోతున్నానని ఇన్‌స్టా వేదికగా చెప్పింది దియా. ఈ ఏడాది ఫిబ్రవరి 15న వ్యాపారవేత్త వైభవ్ రేఖిని దియా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఈ జంట.. ఓ అందమైన ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. సూర్యాస్తమయంలో సముద్రం ఒడ్డున నిలబడిన దియా.. తన కడుపులో పెరుగుతున్న బిడ్డను చేతులతో అదుముకుంటూ ఉన్న ఫోటోను షేర్ చేసి, తాను ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఈ ఫోటోతో పాటు ఓ భావోద్వేగమైన కవితను కూడా ఆ నటి పోస్టు చేసింది.
ఈ సందర్భంగా దియాకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, షిబానీ దండేకర్, తాహీరా కశ్యప్, మహీప్ కపూర్‌తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
దియా మీర్జా గతంలో సాహిల్ సంఘా అనే వ్యక్తిని పెళ్లాడింది. పెళ్లైన 11 ఏండ్ల తర్వాత అంటే 2019లో సాహిల్ నుంచి దియా విడిపోయారు. ఆ తర్వాత వైభవ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 15న వివాహమాడింది. ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా ‘వైల్డ్ డాగ్’ సినిమాతో అక్కినేని నాగర్జునకు జోడీగా దియా మీర్జా నటించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
15 రోజుల కవలలకు కరోనా పాజిటివ్
అలియాభట్‌కు కరోనా పాజిటివ్
కౌటిల్యంపై చాణక్య విజయం
హైదరాబాద్ లో ఇండ్లకు భలే గిరాకీ
సిటీ చుట్టూ రియల్ బూమ్
చిన్నారి ఊపిరి తీసిన ఊయల
అమ్మా నన్ను ఎందుకు వదిలి వెళ్లావ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

