గగన్ విహారి, అపర్ణదేవి జంటగా రూపొందుతున్న చిత్రం ‘1996 ధర్మపురి’. 1996 సంవత్సరంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. జగత్ దర్శకుడు. నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ను దర్శకుడు మారుతి విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ట్రైలర్ చూసిన వాళ్లు అభినందిస్తున్నారు. రాజ గడిలో పనిచేసే ఓ జీతగాడు, బీడీలు చుట్టే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఇది. ధర్మపురిలో చిత్రీకరణ చేశాం. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు.