Dhanush | తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అద్భుత విజయాలు సాధిస్తుండడంతో ఇప్పుడు అందరి దృష్టి టాలీవుడ్‌పైనే ఉంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి బ్లాక్బస్టర్ల ప్రభావంతో ఇతర భాషల హీరోలు కూడా తెలుగులో అవకాశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ “మహానటి”, “సీతారామం”, “లక్కీ భాస్కర్” సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు..ఇప్పుడు అదే బాటలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగు దర్శకులతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చిన ‘సార్’ మూవీ మంచి హిట్‌గా నిలవగా, ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేర’ చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం తమిళంలో తన దర్శకత్వంలో ‘ఇడ్లీ కడై’ అనే సినిమాను రూపొందిస్తూనే, మరోవైపు కొత్త తెలుగు ప్రాజెక్ట్‌కు కూడా సైన్ చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. 2018లో ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వేణు ఊడుగుల, 2022లో ‘విరాట పర్వం’ ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించకపోయినా, వేణుకు మంచి డైరెక్టర్‌గా గుర్తింపు దక్కింది. మూడేళ్ల తర్వాత అతను మళ్లీ డైరెక్షన్ చేసేందుకు రెడీ అయ్యాడు. తాజాగా వేణు ఊడుగుల ఓ పవర్ఫుల్ కథతో మళ్లీ తెరపైకి వచ్చాడట. ఈ కథను కోలీవుడ్ స్టార్ ధనుష్‌కు వినిపించగా, ఆయన కథ విని వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు ఫిలింనగర్లో చర్చ నడుస్తోంది.
అన్ని అనుకున్నట్లుగా సాగితే, ఈ చిత్రం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఈటీవీ విన్‌తో కలిసి ‘రాజు వెడ్స్ రాంబాబు’ అనే చిత్రాన్ని నిర్మించిన వేణు, మళ్లీ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘సార్’, ‘కుబేర’ చిత్రాలతో ఇప్పటికే రెండు విజయాలను అందుకున్న ధనుష్, ఇప్పుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందబోయే ఈ కొత్త చిత్రంతో తెలుగులో హ్యాట్రిక్ హిట్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నాడని టాక్. ధనుష్ ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడన్నది ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉండగా, ఇటీవల బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్‌తో ధనుష్ డేటింగ్లో ఉన్నాడని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.