Heer Express Trailer |’ఓ మై గాడ్’ (OMG), ‘102 నాట్ అవుట్’ వంటి విజయవంతమైన చిత్రాల అందించిన దర్శకుడు ఉమేష్ శుక్లా తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘హీర్ ఎక్స్ప్రెస్'(Heer Express). దివిత జునేజా, ప్రిత్ కమాని ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. దర్శకుడు ఉమేష్ శుక్లాతో పాటు ప్రముఖ నటులు అశుతోష్ రానా, గుల్షన్ గ్రోవర్, సంజయ్ మిశ్రా, మేఘనా మాలిక్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సైయారా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లవ్ స్టోరీ సినిమాలకు బాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇండియాతో పాటు లండన్లో షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకులని అలరిస్తుందని చిత్రయూనిట్ వెల్లడించింది. ఇక ఈ చిత్రాన్ని ఉమేష్ శుక్లా, ఆశిష్ వాఘ్, మోహిత్ ఛబ్రా, మరియు సంజయ్ గ్రోవర్ సంయుక్తంగా నిర్మించారు. సంపదా వాఘ్ సహ నిర్మాతగా వ్యవహరించారు.