Naresh65 | ఒకవైపు ఆల్కాహాల్(Alcohol) సినిమాను విడుదలకు సిద్ధం చేస్తునే మరో కొత్త సినిమాను ప్రారంభించాడు అల్లరి నటుడు నరేష్. తన కెరీర్లో 65వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ నేడు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రం పౌరాణిక హాస్యభరిత కథాంశంతో రూపొందుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకాగా.. యువ నటుడు అక్కినేని నాగ చైతన్య క్లాప్ కొట్టాడు. దర్శకుడు బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. తొలి షాట్‌కి దర్శకుడు వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహించారు. దర్శకులు వశిష్ట, విజయ్ కుమార్, మరియు రామ్ అబ్బరాజు స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి చంద్రమోహన్ సి(chandra Mohan) దర్శకుడు కాగా, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ(Rajesh Danda) మరియు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై లెమన్ ప్రసాద్(Lemon Prasad) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా చైతన్ భరద్వాజ్, ఎడిటర్‌గా ఛోటా కె. ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరికొత్త పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
#Naresh65 ~ A laughter-packed mythical entertainer officially launched with a Pooja Ceremony 🪔❤️🔥
Clap by Yuvasamrat @chay_akkineni
Camera switch-on by @dirbobby
First shot directed by @Dir_Vi_Anand
Script handover by @DirVassishta @RamAbbaraju @DirVijayKShoot begins soon💥… pic.twitter.com/byFRiGpFHj
— BA Raju’s Team (@baraju_SuperHit) September 6, 2025