నార్నూర్ : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల ( Teachers ) పాత్ర కీలకమని ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్, మాజీ సర్పంచ్ రాథోడ్ సావిందర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్ గిరిజన సంక్షేమ ఆశ్రమొన్నత బాలికల పాఠశాలలో ఉత్తమ అవార్డు ( Award Teachers ) ఉపాధ్యాయులు మెస్రం ధన్ను, చౌహాన్ సుభాష్‌ను గ్రామస్థులు శాలువాతో సన్మానించారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకిత భావంతో పని చేస్తేనే గుర్తింపు లభిస్తుందన్నారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించాలంటే ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ఉత్తమ అవార్డు ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు గోవింద్, పంచాయతీ కార్యదర్శి లవ్‌కుమార్, ఉపాధ్యాయులు జ్యోతి, రోజా, శోభ, మానిక్ రావు, ఎస్ఈఆర్పీ జాదవ్ విజయ్ సింగ్, పెద్దలు గణేష్, యాదవ్ రావ్, యువకులు పాల్గొన్నారు.