హైదరాబాద్ : శ్రీశైలం(Srisailam) మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు(Devotees) పోటెత్తారు. నూతన సంవత్సర వేడుకల(New year) సందర్భంగా శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. గురువారం వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆర్జిత సేవలు, అభిషేకాలు నిలిపివేశారు. భక్తులకు అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
ఇవి కూడా చదవండి..
Adult videos | అడల్ట్ వీడియోల కోసం భారతీయుల భారీ ఖర్చు
Mandatory star rating | ఫ్రిజ్, టీవీలకు స్టార్ రేటింగ్స్ తప్పనిసరి.. నేటి నుంచి కొత్త నిబంధనలు