అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్
- పండుగలా జననేత జన్మదిన వేడుకలు
- కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
- పలుచోట్ల దుస్తులు, పండ్లు పంపిణీ
మణికొండ, జోన్ బృందం ఫిబ్రవరి 17 : బంగారు తెలంగాణ సాధకుడు సీఎం కేసీఆర్‌కు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. గురువారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని నియోజకవర్గ పరిధిలోని మణికొండ, నార్సింగి, బండ్లగూడ, శంషాబాద్ మున్సిపాలిటీలతో పాటు రాజేంద్రనగర్ పట్టణ పరిధిలోని ఐదు డివిజన్లు, శంషాబాద్ మండల పరిధిలో అన్నదానం, పేదలకు పండ్లు, దుస్తులు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అన్నారు.
- మణికొండ మున్సిపాలిటీలో ఫ్లోర్‌లీడర్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ తలారి మల్లేశ్, పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, కౌన్సిలర్లు వసంత్చౌహాన్, కావ్యశ్రీరాములు, శైలజ, నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టి, బైక్‌ర్యాలీతో క్రికెట్ గ్రౌండ్‌కు చేరుకుని ముగ్గులతో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని గీసి శుభాకాంక్షలు తెలిపారు. హాజరైన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటంతో తయారుచేసిన కేక్‌ను కట్‌చేసి సంబురాలు నిర్వహించారు. నార్సింగి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ రేఖ యాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్‌యాదవ్, పార్టీ అధ్యక్షుడు నర్సింహ ఆధ్వర్యంలో కేక్ కట్‌చేశారు.
- బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ మహేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. బీజేఎంసీ కాలిక నగర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. హైదర్షాకోట్ గ్రామంలోని కస్తూర్బా ట్రస్టులో అనాథలకు అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు. గాయత్రి నగర్లో మొక్కలు నాటారు. శూన్య హోమ్‌లో వృద్ధులతో కలిసి కేక్ కట్ చేశారు. రంగారెడ్డి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు మహ్మద్ యాసిన్ అయ్యూబీ సులేమాన్ నగర్ డివిజన్లోని మైనార్టీ ఉర్దు మీడియం విద్యార్థులకు పది వేల రూపాయల చెక్కును అందజేశారు. పీఅండ్ టీ కాలనీలో కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్ కేక్ కట్ చేశారు.
- ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు శంషాబాద్ మండలంలోని నర్కూడలో జిల్లా పరిషత్ ఫ్లోర్‌లీడర్ నీరటి తన్విరాజు, మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీపీ జయమ్మ, వైస్ ఎంపీపీ నీలంనాయక్, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- పేదల పెన్నిధి సీఎం కేసీఆర్ అని సులేమాన్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు షేక్ నయీమొద్దీన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు, ప్రధాన కూడళ్ల వద్ద పేదలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. షేక్ బాబా, మహ్మద్ హుస్సేన్, ఎండీ ఫయాజొద్దీన్ , నవీన్, అక్విన్ తదితరులు పాల్గొన్నారు.
- అత్తాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి ఆధ్వర్యంలో పాండురంగానగర్‌లో పేదలకు పండ్లను పంపిణీ చేశారు. డివిజన్ మహిళా నాయకురాలు చెరకు మాధవి అమరేందర్ ఆధ్వర్యంలో రాంబాగ్‌లోని ఆలయంలో పూజలు నిర్వహించారు. అత్తాపూర్‌లో జిల్లా నాయకుడు మిద్దెల సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. నాయకులు సురేందర్‌రెడ్డి, అమరేందర్, నారాయణ, కొలన్ సుభాశ్‌రెడ్డి, మిద్దెల సురేందర్‌రెడ్డి, శంకర్, శ్రీనివాస్‌గౌడ్, నగేశ్, శ్రీను, రాముయాదవ్, మోహన్‌రెడ్డి, సత్యనారాయణ గౌడ్, జైహింద్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- ప్రతి ఒక్కరూ సేవాదృక్పథం కలిగి ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కళాశాల అసోసియేట్ డీన్ డా. రవీందర్ రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బుద్వేల్ సెయింట్ అల్పోంసా కరుణామయ పాఠశాలలో వంట సామగ్రి, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరుణామయ పాఠశాల డైరెక్టర్ థామస్, విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
- ప్రతి మొక్క భవిష్యత్ తరానికి ఆయువు పట్టు అని శ్రీ కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ గిర్వాణి అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. జ్యోతి మాట్లాడుతూ శాస్త్రవేత్తల కృషివల్ల నూతన వంగడాలు అందుబాటులోకి రావడం,సేంద్రియ వ్యవసాయం, అధునాతన పరికరాలు తదితర వాడకం వల్ల అనతి కాలంలోనే తెలంగాణ రైతు విప్లవాత్మక మార్పు వచ్చిందని గుర్తుచేశారు. అధ్యాపకులు డా. రాజాగౌడ్, డా. జ్యోతి , నవీన్, మల్లేశ్ , నాగహర్షిత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

