చిట్యాల, మార్చి 11 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో పట్టణాలకు దీటుగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో శుక్రవారం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.80లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ పలె ్లప్రగతి నిధులతో గ్రామాలను తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు, రైతులకు, గీత కార్మికులకు బీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు. ఎంపీపీ కొలను సునీతా వెంకటేశ్, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ సత్తయ్య, నాయకులు వనమా వెంకటేశ్వర్లు, ఆవుల ఐలయ్య, కల్లూరి మల్లారెడ్డి, కూరెళ్ల లింగస్వామి, గుత్తా వెంకట్రాంరెడ్డి, మేడి ఉపేందర్, చిత్రగంటి ప్రవీణ్, బాతరాజు రవీందర్, ఉయ్యాల నరేశ్, నాగరాజు, దశరథ, స్వామి, ఏళ్ల సత్యనారాయనరెడ్డి, మశ్చేందర్ పాల్గొన్నారు.