Devdutt Padikkal : శ్రీలంక పర్యటనలో అంచనాలు అందుకున్న దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal) టెస్టుల్లో మొట్టమొదటి శతకంతో చెలరేగాడు. వామప్ మ్యాచ్‌లో వందతో జట్టును ఆదుకున్న ఈ కుర్రాడు.. గాలే టెస్టులోనూ దంచేశాడు. కేఎల్ రాహుల్(77తో 150 ప్లస్ భాగస్వామ్య నెలకొల్పిన పడిక్కల్ టీ సెషన్ తర్వాత సెంచరీ అందుకున్నాడు. నువాంత ఓవర్లో సింగిల్‌తో సుదీర్ఘ ఫార్మాట్లో తొలిసారి మూడంకెల స్కోరందుకున్నాడీ లెఫ్ట్ హ్యాండర్. ఖతర్నాక్ ఇన్నింగ్స్‌తో వ్యక్తిగత మైలురాయిని సాధించిన పడిక్కల్‌ను కోచ్ గౌతం గంభీర్, సహచరులు అభినందించారు.
గాలే టెస్టులో దేవ్‌దత్ పడిక్కల్ రికార్డు శతకం కొట్టాడు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(32) రనౌటయ్యాక క్రీజులోకి వచ్చిన పడిక్కల్ సెంచరీతో కదం తొక్కాడు. లంచ్ అనంతరం జోరు పెంచిన అతడు.. టీ సెషన్ తర్వాత లహిరు కుమార ఓవర్లో వరసగా రెండు ఫోర్లతో 90లోకి వచ్చాడు. అనంతరం నువాంత ఓవర్లో సింగిల్ తీసి.. సుదీర్ఘ ఫార్మాట్లో మొట్టమొదటి శతకం సాధించాడు పడిక్కల్.
MAIDEN TEST HUNDRED! 💯
A special moment on a special day for Devdutt Padikkal in Galle 🥳
Updates ▶️ https://t.co/M9LVyCAp8y#TeamIndia | #SLvIND pic.twitter.com/8x1HcYeFbA
— BCCI (@BCCI) August 15, 2026
ఇప్పటి వరకూ రెండు ఫిఫ్టీలకే పరిమితమైన అతడు.. ఈసారి తన సెంచరీ కలను సాకారం చేసుకున్నాడు. తద్వారా.. 21వ శతాబ్దంలో మూడో స్థానంలో ఆడుతూ టెస్టు వంద కొట్టిన రెండో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడీ కుర్రాడు. 2022లో జింబాబ్వేపై సౌరవ్ గంగూలీ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత.. పలువురు మూడో స్థానంలో ఆడినా.. ఎవరూ మూడంకెల స్కోర్‌కు ముందే ఔటయ్యారు.