కాసిపేట, డిసెంబర్ 4 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని లంబాడి తండా(డీ) గ్రామ పంచాయతీలో గుడుంబా స్థావరాలపై గురువారం దేవాపూర్ పోలీసులు దాడులు చేశారు. దేవాపూర్ ఎస్ఐ గంగారాం, తన సిబ్బందితో కలిసి లంబాడితాండ(డీ)లో గుడుంబా నిలువ చేసిన స్థావరాలను గుర్తించి గుడుంబాను ధ్వంసం చేశారు.
ఈ సందర్బంగా దేవాపూర్ ఎస్ఐ గంగారాం మాట్లాడుతూ గుడుంబా తయారు చేసినా, అమ్మకాలు చేసిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నాటు సారా తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.