e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News Telangana | డిటెక్టివ్‌ మూవీ చూసి చంపేశాడు.. మృత‌దేహం ఏడు ముక్క‌లు..

Telangana | డిటెక్టివ్‌ మూవీ చూసి చంపేశాడు.. మృత‌దేహం ఏడు ముక్క‌లు..

  • కాంపెల్లి శంకర్‌ హత్య కేసులో వీడిన మిస్టరీ
  • నిందితులు భార్య, ఆమె ప్రియుడు రాజు
  • వివాహేతర సంబంధమే హత్యకు కారణం

జ్యోతినగర్‌, నవంబర్‌ 29 : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కలకలం రేపిన కాంపెల్లి శంకర్‌ హత్య కేసు మిస్టరీ వీడింది. హత్యకు సంబంధించి పోలీసులకు సాక్ష్యాలు దొరక్కుండా నిందితుడు డిటెక్టివ్‌ సినిమాను అనుసరించాడు. మృతదేహాన్ని ఏడు ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో వేసినట్టు విచారణలో తేలింది. హతుడి భార్య హేమలత, నిందితుడు పొయ్యిల రాజుకు మధ్య వివాహేతర సంబంధమే ఈ ఘాతుకానికి కారణమని తెలిసింది. సోమవారం ఎన్టీపీసీ పోలీసు స్టేషన్‌ ఆవరణలో సీపీ చంద్రశేఖర్‌రెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎన్టీపీసీ ఖాజీపల్లికి చెందిన కాంపెల్లి శంకర్‌, హేమలత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.

శంకర్‌ గోదావరిఖనిలో మీసేవ కేంద్రంలో ఆపరేటర్‌గా, హేమలత ఎన్టీపీసీ ధన్వంతరి దవాఖానలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్నారు. కాగా, అదే దవాఖానలో పనిచేస్తున్న పొయ్యిల రాజుతో హేమలతకు వివాహేతర సంబంధం ఉన్నది. ఈ విషయంపై భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తమ బంధానికి అడ్డుగా ఉన్న శంకర్‌ను అంతమొందించాలని రాజు నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రెండు కత్తులను సైతం కొనుగోలు చేసి సమయం కోసం వేచిచూస్తున్నాడు. ఈ నెల 25న రాత్రి శంకర్‌-హేమలత మధ్య గొడవ జరిగింది. అనంతరం రాత్రి 10 గంటల ప్రాంతంలో శంకర్‌ బైక్‌పైన హేమలతను దవాఖానలో దింపాడు. రాత్రి 10:30 గంటల సమయంలో రాజుకు ఫోన్‌ చేసి ‘నీ వల్లే మా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఇది కరెక్ట్‌ కాదు’ అని చెప్పాడు. ఇదే అదునుగా భావించిన రాజు.. శంకర్‌ను తన ఇంటికి పిలిపించుకున్నాడు. అతిగా మద్యం తాగించాడు.

- Advertisement -

రాత్రి 11 గంటల సమయంలో బీరు సీసాతో శంకర్‌ తలపై బలంగా కొట్టాడు. స్పృహ కోల్పోగానే కత్తులతో విచక్షణారహితంగా నరికాడు. డిటెక్టివ్‌, నా పేరు శివ సినిమా తరహాలో హత్యకు సాక్ష్యాధారాలు దొరక్కుండా.. శంకర్‌ శరీరాన్ని ఏడు భాగాలుగా చేసి గోదావరిఖని, సప్తగిరికాలనీ, ఆర్టీసీ క్వార్టర్స్‌ వెనుకాల పడేశాడు. కాగా, గురువారం రాత్రి బయటికి వెళ్లిన శంకర్‌ ఇంటికి రాకపోవడంతో మరుసటి రోజు సాయంత్రం తల్లి పోచమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేరోజు హేమలతను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 27న ఉదయం శంకర్‌ శరీర భాగాలను గుర్తించి, మిస్సింగ్‌ కేసును హత్య కేసుగా తీసుకున్నారు. నిందితుడు రాజు ఆదివారం కరీంనగర్‌కు బైక్‌పై పారిపోతుండగా తెలంగాణ ప్రాజెక్టు చౌరస్తాలో పట్టుకున్నట్టు సీపీ తెలిపారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement