న్యూఢిల్లీ, మార్చి 10: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లెవల్-1 పరీక్షల్లో అవకతవకలపై నిరసనలు తెలుపుతున్న విద్యార్థులకు శుభవార్త. అభ్యర్థుల డిమాండ్లు అన్నింటినీ ఆర్ఆర్బీ అంగీకరించింది. ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులను మళ్లీ షార్ట్‌లిస్ట్ చేస్తామని తెలిపింది. ఈ సారి పే లెవల్ అధారంగా 1:20 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నది. వీరంతా రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్టు రాయాల్సి ఉంటుంది. ఆర్ఆర్బీలో నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీలో 35,281 పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్టు ముగిసింది. అయితే, ఒకే అభ్యర్థిని ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు షార్ట్ లిస్ట్ చేయడంతో నిరసనలు వెల్లువెత్తాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ర్టాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి.