మంచిర్యాల : కాసిపేట మండలంలోని లంబాడీతండా (ఎస్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాలలతో పాటు కాసిపేట మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాన్ని మంచిర్యాల డీఈవో యాదయ్య ( DEO Yadaiah ) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు (surprise inspection) . పాఠశాలలలోని రికార్డులను పరిశీలించారు.
విద్యార్థులకు అందించిన నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులపై హెచ్ఎంలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లంబాడీతండా(ఎస్) ప్రైమరీ పాఠశాలలో విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు. తక్కువ యూనిఫామ్స్ అందిన పాఠశాలలకు వెంటనే అందించాలని మండల విద్యాధికారి ముక్తవరం వెంకటేశ్వర స్వామిని యాదయ్య ఆదేశించారు. మద్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. కస్తూర్భాలో సరుకుల నాణ్యతను ఉండాలని, భోజనం రుచికరంగా అందించాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.