
కొల్లాపూర్, డిసెంబర్ 10 : ప్రభుత్వ దవాఖానల్లో సాధార ణ కాన్పులు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ పద్మజ ఆదేశించారు. ఇం దుకోసం ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం కొల్లాపూర్ ప్రాంతంలో మెటర్నల్ హెల్త్ న్యూట్రిషన్పై జరుగుతున్న సేవలను ఆమె తనిఖీ చేశారు. కొల్లాపూర్ డివిజన్లో సాధారణ కాన్పులు తక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. సిబ్బంది ప్రజలకు వైద్య సేవలపై పూర్తిగా స్థాయిలో వివరించాలని సూచించారు. పట్టణంలోని సివిల్ దవాఖానతోపాటు రామాపూర్ శివారులో తుది మెరుగులు దిద్దుకుంటున్న 50 పడకల మాతా,శిశు రక్షణ కేంద్రాన్ని ఆ మె సందర్శించారు. రక్షణ కేం ద్రం నిర్మాణ పనులపై ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తి చే సి భవనాన్ని అప్పగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ భరత్ కుమార్రెడ్డి, డాక్టర్లు చంద్రశేఖర్, జయచంద్ర ప్ర సాద్ యాదవ్, హెల్త్ ఎడ్యుకేటర్లు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, పీఆ ర్వో రేణయ్య, ఫార్మసిస్ట్ జీకే వెంకటేశ్, హెల్త్ సూపర్వైజర్ వెంకట మ్మ తదితరులు పాల్గొన్నారు.