హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : చేనేతపై విధిస్తున్న జీఎస్టీని పూర్తిగా తొలగించాలని టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానించడం పట్ల అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం హర్షం వెలిబుచ్చింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపింది. చేనేతపై జీఎస్టీని తొలగించాలని తీర్మానాన్ని ప్రతిపాదించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ, బలపరిచిన మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఆమోదించిన ప్రతినిధులందరికీ చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న ధన్యవాదాలు తెలిపారు.